దేవా మా జీవితాలు

దేవా మా జీవితాలు-నీకు అంకితం అందించావు క్రీస్తు – క్రొత్త జీవితం

1. మునుపటి మా ప్రవర్తన నీకు దూరము మా పాపపు జీవితాలు అధిక భారము మాకు క్రీస్తునందు కలిగెమహాపకారం మరువరానిది ఇది మహదైశ్వర్యం ||దేవా||

2. దేవుడు లేడనుచు – బుద్ధిహీనులైతిమి దేవుడు దయాళుడంచు – ఎరుగమైతిమి దేవుడు మనుజుండై భువి కరుగుదెంచెను కృపాసత్య సంపూర్ణుడుగా నివసించెన్ ||దేవా||

3. మాకు ప్రతిగ నీ ప్రాణం- నర్పించితివి సిలువ శ్రమలలో రక్తం చిందించితివి జీవగ్రంధమందు పేర్లు వ్రాయించితివి మమ్ము పరముజేర్చ వరములిత్తు నంటివి ||దేవా||