About Us

1 కొరింథీ 16:16 వచనములలో ఆకయ యొక్క ప్రధమ ఫలముగా స్తెఫను ఇంటి వారిని గూర్చి వ్రాయబడినది. అనగా ఆరంభ విశ్వాసులలో స్తెఫను ఇంటివారిని చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా, ఆ ఇంటివారు పరిశుద్దులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొనిరసుమాట బహు విశేషమైనది.

అలాగుననే నెల్లూరు ప్రాంతములలో సంఘాలు స్థాపింపబడినప్పుడు ఆరంభ విశ్వాసులలో సహోదరుడు పీటర్ గారు ఒకరు ఉద్యోగాలు చేయుచు ప్రభువు కొరకు ప్రయాస ఫలితమే ఈనాడు మనము చూస్తున్నాము. వారిలో చాలామంది ప్రభువు సన్నిధి చేరుకొన్నారు. ప్రియులు పీటర్ గారు తన యౌవన కాలములో రక్షణ పొంది తన కుటుంబముతో కలిసి ప్రభువు కొరకు స్థానికముగాను, చుట్టుప్రక్కల సంఘముల మధ్యను ప్రయానపడ్డారు.

ప్రభువు ఆయనను సువార్తలో ప్రత్యేకముగా, సంగీత వరమిచ్చి అనేక పాటలు రచించి. అనేకులకు నేర్పించి అనేకులకు ఆశీర్వాదకరముగా వాడబడిన వ్యక్తి వారి కుమారులు, కుమార్తెలు ప్రభువు పనిలో ప్రభువు కొరకు నిలబడుటకు కృపచూపిన ప్రభువుకు స్తోత్రములు రిటైర్డ్ అయిన తరువాత కూడా ప్రభువు పనిలో శ్రద్ధ గలవాడై ప్రభువు తన మహిమకు పిలుచు వరకు, ప్రభువు కొరకు ప్రయాసపడ్డారు. ఆయన మాదిరి కుటుంబమునకేమి, సంఘమునకేమి మాదిరి చూపి వెళ్ళారు. ఈనాడు మనము కూడా యెహోషువ 24 16 ప్రకారము నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదమనే గురి కలిగి మన పరుగు పందెములో పరుగెత్తుదుము.

S. ప్రభుదాస్