వెలిగించెను జ్యోతి వెలిగించెను

వెలిగెంచెను జ్యోతి వెలిగెంచెను – వెలిగించి వెలిగించుమని పల్కెను – యేసు వెలిగించుమని పల్కెను

1. జగతికంతయు నీవె జీవన జ్యోతివి – నీ మాటతో కలిగె నిఖిలమంతయు వెలుగు నీ వెలుగులో మాకు యిమిడియున్నది నీతి- నడిపించు మా దేవా మము నీతిమార్గమున్ ॥వెలి॥

2. మా హృదయమంతయు మోసకరమైనది మా తలపులన్నియు మరి అంధకారముల్ – నీ రక్త కాంతిలో మాదోషములు కడిగి నీతిసూర్యా మాకు జ్యోతివైతివి దేవా ॥వెలి॥

3. మాదీపములు మిణుకు మిణుకు మనుచున్నవి దీపంబులో జ్యోతి దిగజారిపోకుండ బుద్ధి జ్ఞానము కలిగి బద్దకంబులు మాని పెండ్లి కొమరుని విందు సిద్దపడియుండండి ॥వెలి॥

4. పరిశుద్ధాత్ముడు మనకు పావనంబగు నూనె – సిద్దియే హృదయంబు సిద్ధపడి నింపండి ఆటంకములు ఎన్నో అవి ఆరి పోవును-మానకను మీ దీపములు వెలుగనియ్యండి ॥వెలి॥

5. దీపంబు ముట్టించి పాత్రతో కప్పించి మంచంబు క్రిందను మరిదాచకుండను స్తంభంబు పై నుంచి చాల వెలుగును యిచ్చి అందులో చెరుటకు అవకాశమివ్వండి ॥వెలి॥