హృదయపు వాకిట

హృదయపు వాకిట క్రీస్తు నిలబడి – పిలచెను ఇదిగో పలకండి – పలికినవారికి ప్రభు సన్ని ధిలో – రక్షణ కలదని నమ్మండీ

1. జీవన పోరాటంలో అలసి ఆదమరచి నిద్రిస్తున్న జనాంగమా – నిదురమేలుకోండీ ప్రభుని వేడరండీ ||హృద||

2. చైతన్యానికి ఆలయం – చేరుము క్రైస్తవ్యం ఈ విశాల విశ్వంలో-ముద్రవేయబడెను ప్రభువు క్రీస్తే దేవుడని ||హృద||

3. మరణపాశములు మాన్పెను – మనకు జీవము నిచ్చెను – విశ్వశాంతికి మూలము – విశ్వ ప్రేమ కాధారము – వినుడీయేసుని మార్గము ||హృద||

4. దైవభక్తికి మర్మము – దానినెరుంగుట ధర్మము రక్షకుడని ప్రకటింపబడిన – రాజు యేసుని నమ్ముడు రారాజు సన్నిధిని జేరుము ||హృద||