విడువబడిన మానవుడా

విడువబడిన మానవుడా – నడువుమా ప్రభుకడకు విడుదలనూ పొందుమా గడువుదాటిపోవును ||విడు||

1. నీ పాపహరణంకోసం యేసు సిలువకెక్కా డు – నిన్నూ రక్షించుట కొరకు – యేసు రక్తంకార్చాడు – యేసు ప్రభుని వేడుకొనినా -తెరువబడును నీహృదయం మరువబడును నీ పాపం॥విడు॥

2. ఐదు రొట్టెలు రెండు చేపలు – ఐదు వేలకు పంచాడు – పన్నెండు గంపలు మిగిలె ప్రజలెల్ల భుజించారు – ఆశ్చర్యకార్యములెన్నో అలవికావు వర్ణింప కొలువలేము కొలతెంతా ||విడు||

3. మరణించిన యేసు ప్రభువు మూడోనాడు లేచాడు – అందరికి కనిపించి-ఆరో హణుడయ్యాడు తిరిగివచ్చి యేసు ప్రభువు తీర్పుతీర్తునన్నాడు – సువార్త నమ్మమన్నాడు ||విడు||