ప్రభువు పరము వీడెను
ప్రభువు పరము వీడెను – పాపి దరికి చేరెను పాపమునకు తానె బలియై – పాపిని రక్షించెను
1. పాపమందు నిల్వబోకు – అగ్నియందు జారబోకు – ప్రభుని నీవు నమ్మకున్న గతులు లేవు నీకు నున్న – అందుకొనుము ప్రభువు ను నేడే ఆదరించి బ్రోచునూ ||ప్రభు||
2. నీవు చూచు దృశ్యమంతా – నీవు నమ్ము సృష్టి యంతా ఆదుకోదు నిన్ను సుంత-అగ్ని కాల్చు దాని నంత చెంత జేరు ప్రభువునేడే చింత దీర్చి బ్రోచునూ ॥ప్రభు॥
3. యేసే న్యాయ తీర్పుకర్త – యేసే సర్వసృష్టి భర్త – యేసే సర్వమునకధికారి యేసే మోక్షమునకు దారి – యేసున్ నీవు నమ్ము కొన్న నిన్ను జేర్చు నిత్య రాజ్యం ||ప్రభు||
