స్వర్గయాత్ర సాగరండి
స్వర్గయాత్ర సాగరండి – మార్గమేసు ప్రభువెనండి పరమైనది – ఘనమైనది – పరలోక రాజ్యమండి
1. మీ ఆత్మవిషయమైన దీనూలు అయిన ఎడల (2) పరలోకము ప్రాప్తించును పరిశుద్ధు లౌదురండీ ॥స్వర్గ||
2. హృదయాలు శుద్ధి అయిన – సదయులు ధన్యులండీ (2) వారందరు పొందెదరు దేవుని దర్శనంబు ||స్వర్గ||
3. సమాధాన పరచుచుండు సజ్జనులు ఇజ్జగమున (2) ధన్యులౌదురు మాన్యులౌదురు దైవపుత్రులౌదురండి ||స్వర్గ॥
4. నీతి నిమిత్తమయ్యు – హింసింపబడుదురేని (2) నీ ఫలములు అధికంబగున్-పరలోక భాగ్యమందున్ ॥స్వర్గ॥
5. నీతికొరకు మీరు – ఆకలి దప్పులైన (2) వారందరు తృప్తిపొందుదురు బహుధన్యులేదురండీ ॥స్వర్గ॥
6. సాత్వీకులైనవారు – సరసూలు అగుదురండీ (2) వారందరు భూలోకమున్ స్వతంత్రించుకొందురండీ ॥స్వర్గ||
7. ఆత్మీయవిషయమైన – దుఃఖంబునొందు వారు (2) రారండయా నమ్మండయా రక్షకుడేసునేడే ॥స్వర్గ||
