సహోదరా సహోదరీ
సహోదరా సహోదరీ సాగుమా ప్రభుసేవలో సత్యమైన పధములో
1. నీతిమంతురాలు రూతు-నిలచిసాగి పోయెనే ఓర్పయైతే మార్పుజెంది–మరలిపోయెనె మార్గమిడచి ||సహో||
2. తల్లినైనను తండ్రినైనను-అన్నదమ్ములనైనను అన్ని వదలి కన్న యేసుని-అడుగు జాడలో నడువుమా ||సహో||
3. నీజనమే నాజనంబనియే-నీ దేవుడు నా దేవుండనియె మనసుకుదిరె మార్గమెరిగె-నడచిపోయెనయోమితో ||సహో||
4. మనసహోదరి మనకు మాదిరి – మంచి సాక్ష్యముపొందెనే ఖ్యాతినొందె నీతిగలదై – ఎఫ్రతా బెత్లహములలో ||సహో||
5. అడుగువాటికన్న ప్రభువు-అధికముగ దయచేయును అడిగెబోయజు నా సహోదరి-అతనిదయను పొందెనే ||సహో||
6. మోయబీయురాలు రూతు లేయను పోలినదాయెను – ఆశ్రయించెను ఆమెబోయ జు వర్ధిల్లెను ఇశ్రాయేలు వంశము ||సహో||
