నిజమైన ద్రాక్షావల్లి
నిజమైన ద్రాక్షావల్లి నాయేసు ఉత్తమద్రాక్షావల్లి నిను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదిగెడు తీగెలం
1. సత్తువగల భూమిలో వల్లిని చక్కగా పోషించెను శ్రేష్ఠఫలములు ఆశించే భ్రష్ఠమైనని ఫలియించె ॥నిజ॥
2. ఫలియించు లతలన్నిటిన్ యేసుండు ఫరిఢవిల్లగ జేయును ఫలియింపని తీగెను యేసుండు పారవేయును అగ్నిలో నిజ॥
3. పరిశుద్ధాత్ముని సాయమున్ ఆశించి ఫలియించుము సోదరా వ్యర్థుడవుగా నున్నచో యేసుండు-వ్యసనక్రాంతుండౌనుగ ॥నిజ॥
4. కారు ద్రాక్షలు కాచిన కారణం కనిపెట్టెను ప్రభువు క్షమియించమని వేడిన ఓ ప్రియుడా క్షమియించి నడిపించును ॥నిజ॥
5. పశ్చాత్తాపము నొందిన ఓ ప్రియుడా పారద్రోలును చీకటిన్ వెలుగునిమ్మని వేడిన ఆ ప్రభువు వెలిగించి నడిపించును ||నిజ॥
