కృపావరములు

కృపావరములు క్రుమ్మరింపబడెను ఓ ప్రియుడా కోరుకొనుము వానిన్ – ప్రాలుమాలకను ప్రభు మహిమార్ధము పని జరిగించుము

1. ప్రవక్తలు వ్రాసిరి ప్రవచనవాక్యముల్ పట్టుకొనుము వానిన్ ఓ ప్రియుడా ప్రవచించుము వానిన్ – దీనికి మించిన ప్రవచనము ఈ దినములలో లేదు ॥కృపా॥

2. పరిచర్యవరము ప్రశస్తమైనది ప్రభువిచ్చెను మనకు సంఘములో పని జరిగిం చుము – ఆత్మతోను విశ్వాసముతోను ఆ పనిలో సాగుము ॥కృపా॥

3. బోధించువరము ఎంతో అవసరము బోధించుము వాక్యము ఓ ప్రియుడా బోధకు డవు కాకుము – తర్ఫీదు పొంది యోగ్యత నొందుము – తరుణమున్నది నీకు ॥కృపా॥

4. హెచ్చరించు వరమెంతో శ్రేష్ఠము హెచ్చరికచేయుము సంఘములో ఎంతో అవసరము యెసేబువోలె హెచ్చరించుము యోచన చేయుము ॥కృపా॥