తండ్రికి తనయుడు వేరగుట

తండ్రికి తనయుడు వేరగుట పరమ తండ్రికి తనయుడు పగయగుట సహింపరానిది జగాన చాలా అక్రమమైనది

1. తండ్రికి ఒకడు వేరై తన ఆస్థినంత పంచుకొని దూరదేశము వెళ్లెన్ దుర్యాపారము జేసెన్ ఆస్థిని వేశ్యలతో తినివేసి – అతడొక కూలికి జేరెన్ ||తండ్రికి||

2. పందుల మోపెడి కూలి తనకూటికిచాలక పోయె – పందులు తినెడిపొట్టును తింటూ – పలుపాట్లు పడసాగె కూటికి గుడ్డకు కరువైపోయె కూలిపోయె పసివాడు ||తండ్రికి||

3. తండ్రితో ఉన్న తన అన్న తమ్మునికంటె బహు మిన్నై – తండ్రికి ఉన్న సిరిసంపదలు తండ్రితో హాయిగ సుఖియించె – తండ్రిని విడచివేరగుట – ఎంతో తప్పని గ్రహించె ||తండ్రికి||

4. బుద్ధివచ్చినప్పుడు వాడు తండ్రిని క్షమాపణడిగిన్ తనదాసులలో ఒక్కనిగా తండ్రీ చేర్చుమని వేడెన్ – తప్పిపోయి దొరికెనని – తండ్రి యింటిలో చేర్చుకోనెన్ ||తండ్రికి||

5. మనుష్యుడు దేవుని విడిచెన్ తనకేమియని గర్వించెన్ నరుడు పాపముచేసి నరకాగ్నికి గురియయ్యెరీ ప్రభువును శరణువేడగా-కరుణించి పరమున జేర్చెన్ ||తండ్రికి||