యేసుతో సోదరా సాగుమా
యేసుతో సోదరా సాగుమా – యేసే నీ దేవుడని ఎరుగుమా
1. జ్ఞానములో వయస్సులో ఎదుగుమా ఆత్మలో ఎదిగి బలము పొందుమా దేవుని దయయందు సాగిపోవుమా మనుష్యుల దయ యందు వర్ధిల్లుమా ॥యేసు॥
2. బోధకుల మధ్యను కూర్చుండుమా బోధకుల మాటలాలకించుమా అవసరమైనన్ని ప్రశ్నలడుగుమా అనుభవజ్ఞానంబును పొందుమా ||యేసు||
3. స్వార్థపరత్వంబు విడనాడుమా సువార్త సేవయందు సాగిపోవుమా యేసు క్రీస్తు ఒసగు నిత్యజీవము యేసే తప్పించె నిత్యనరకము ||యేసు||
4. కార్చెను నీ కొరకు యేసు రక్తము తీర్చెను నీ పాపభారమొత్తము సత్యరూపియైన ఆత్మవచ్చెను సత్యమార్గమందు నీవు నడువుమా ||యేసు||
