పరమ దేవుని వాక్యము

పరమదేవుని వాక్యము పరిశుద్ధమైనది వాక్యము పాపులనెల్ల పవిత్రులజేసి పరము జేర్చును వాక్యము

1. మేలిమి బంగారు కంటెను-జుంటె తేనెధారల కంటెను అతిమధురంబై ఆహారంబై- ఆమోదంబై యున్నది ॥పరమ॥

2. అగ్నిజ్వాల వంటిది వాక్యము-కల్గించునదీ వాక్యము మలినముతో నిండిన – మనహృదయముల మండింపజేయును వాక్యము ॥పరమ॥

3. ఖడ్గము వంటిది వాక్యము-ఖండించునుగా పాపము ప్రాణాత్మలను మూల్గులనెల్ల-పరిశోదించును వాక్యము ॥పరమ॥

4. నీటి బుగ్గవంటిగి వాక్యము-నీకిచ్చును నిత్యజీవము దీపమువంటిదై దీనుల జ్యోతియై-దిక్కుచూపునదీ వాక్యము ॥పరమ॥

5. సకలైశ్వర్య సంపన్నము – సంతుష్టి సమాధానము తన్ను ప్రేమించిన తన భక్తులకు-తరగనిధనాగారము ॥పరమ॥

6. సమయం అసమయమందును సంపూర్ణ శాంతముతోడను ప్రయాసముతో పవిత్రతతో-ప్రకటించుము ప్రభువాక్యము ॥పరమ॥