ప్రభువా నీ హృదయంలో

ప్రభువా నీ హృదయంలోన పరవశమైపోతిని గాన నీ కనులలో నీడగనిలచి – నీ కంకితమైపోతిని గాన

1. నీ రక్షణ పరిధులలోను నీ అడుగుల జా డలలోన – నీ శాంతి పాలనలోన నిరతం పరనశించిపోన – ఆత్మల సంపాదనలోన ఆవేశపరుడైపోన – వాగ్దానభూమిలోన వర్ధిల్లెద యేసులోన ||ప్రభువా||

2. నా జన్మము భూలోకమున – నేనుందును పరలోకమున – నివశింతును నా ప్రభు తోన – నిలుచుండు ప్రభుమార్గాన ప్రభువా నీ గమనములోన – పాలించి చూచెదగాన మర్త దేహము విడువాన మహిమా తేజముతో పోన ||ప్రభువా||