దేవుడూ నిజమైన దేవుడూ
దేవుడూ నిజమైన దేవుడూ దీనులను కాపాడె దివ్యతేజుడు కలువరి సిలువలో వ్రేలాడు యేసయ్యను జూడుడీ
1. అంత మహాదేవుడు – ఎంత దీనుడయ్యాడో ఇది యెంత త్యాగమో – తలంచుడీ
॥దేవుడూ॥
2. రక్తము చిందించన్ – రాదుపాపములకు క్షమాపణ రిక్తుడై ఆ ప్రభువు-రక్తము చిందించెనూ మన పాపములకు కలిగె రక్షణ ॥దేవుడూ॥
3. మూడవ దినమున – మృతి గెల్చిలేచె ఎంత సత్యమూ ప్రవచించిరి ప్రవక్తలు-పలికెను వేదముల్ ఆరోహణుడై-పరమునకేగెనా ||దేవుడూ||
4. ఆది దేవుడలనాడు లేఖనములతో అది వ్రాయించెను నమ్ముడి శుభవార్తను నమ్మకున్నన రకము నమ్మినవారిని నిత్యజీవము ॥దేవుడూ॥
