జగతికి జ్యోతియు నీవే

జగతికి జ్యోతియు నీవె (మానవ) జాతికి మనుగడ నీవె యేసు నీవె

1. భూమ్యాకాశములౌ పుట్టించితివి సూర్యచంద్రాదుల సృష్టించితివి పగటి నేలమని సూర్యునికి రాత్రి నేలమని చంద్రునికి ఆజ్ఞాపించి ఆశీర్వదించి-బహురమ్యంబని భావించితివి ||జగ॥

2. నీ పోలికలో నీ స్వరూపములో నరుని సృష్టించి నారినిజేరి భూమి నేలుమని ఫలియించామని ఆహారమిస్తివి ఆదరించితివి శోధకుని చేత శోధింపబడి-అతిక్రమించిరి ఆ ప్రభువాజ్ఞ ॥జగ॥

3. మనుజుని పెంచి మాన్యునిచేసితి తిరుగబడెను నినుతిరస్కరించెను గార్ధభమెరిగె తనస్వంత గృహమును వృషభమెరిగెను తనకామందును దుష్టులూ-దుర్వ్యాపారులు-ప్రభుమార్గము విడిచిపాడైపోయిరి ॥జగ॥

4. సమ్మతించి ప్రభుమాటలు వినిన క్రుమ్మరించును కృపావర్షమును పాపిని నేనని ప్రబుని వేడిన సిలువలో కార్చిన విలువైన రక్తం ప్రతిపాపంబును పవిత్రపరచి విముక్తి నొసగి విశ్రాంతినిచ్చును ॥జగ॥