విశ్వాసం విశ్వాసం

విశ్వాసం – విశ్వాసం – విశ్వాసం నిరీక్షింపబడువాటి నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకాధారం

1. హేబేలు విశ్వాసం – దేవుడిష్టపడెనుగా నీతిమంతుడను సాక్ష్యమునిలిచి యుండెగా హనోకు విశ్వాసం అందరికి ఆశ్చర్యం మరణము రుచిచూడక – మాన్యుడై దివికేగె ॥2॥

2. నోవహు విశ్వాసం – పట్టుదలకు ప్రాముఖ్యం ఇంటివారి రక్షణకై – చేసెను ఒక ఓడను జల ప్రళయము నుండి-ఓడ చేరెను ఆకాశము తనవారిని రక్షించెన్ – విశ్వాసము ఫలియించెన్ ॥2॥

3. అబ్రహాము విశ్వాసం అవి గొప్ప ఆదర్శం వాగ్దాన దేశమునకు-ఏగెను పరవాసియై శారావిశ్వాసము – స్థిరముగను నిలచెను సంఖ్యకు మించిన – సంతానమధికమాయె ॥2॥

4. మోషే విశ్వాసము – మొదట చెప్పదగినది ఐగుప్తుధనము కంటె – క్రీస్తునింద భాగ్యమని అల్పకాలభోగముల-అనుభవము హేయమని వీడెను ఫరోకుమార్తె – వెడలెను దేవుని ప్రజతో ॥2॥

5. ఇక ఏమి చెప్పుదును-ఏమని వర్ణింతును గిద్యోనుబారాకు – యెప్తా సమ్సోనులు సమూయేలు దావీదు-ప్రముఖులైన ప్రవక్తలు విశ్వాసవీరులై – విలసిల్లిరి ధరలోన ॥2॥