తీర్పు దినం

తీర్పు దినం మహా తీర్పు దినం త్వరగ వచ్చుచుండె మహాప్రళయ దినం

1. క్రీస్తు తీర్చు తీర్పులు – సత్యములు న్యాయములు లోకుల దృష్టికి అందని – నిత్యనిబంధనలు రక్షణ పొందిన ప్రజలకు ఇవియే ఘనస్మృతులు రక్షణ పొందని ప్రజలకు ఎంత విచిత్రములు ॥తీర్పు॥

2. తరతరాలు తానమ్మినదే పరమసత్యమని దేవుడెక్కడున్నాడని – దివిని తీర్పులేదనిన క్రీస్తు న్యాయపీఠమెదుట – నిలిచెదన సత్యమని దుష్టులు క్షయంబుమాని-ధైర్యముతో తిరుగుచుండ ॥తీర్పు॥

3. కయీను నడచిన – మార్గమందు నడచిన బిలాము పోయిన – తప్పుత్రోవ బోయిన కోరహు చేసిన-తిరస్కారములు చేసిన తీర్పులో నిలుతువీవు-తీర్పును తప్పించు కోవు ॥తీర్పు॥

4. నోవహుదినములలో జలప్రళయం ఒక తీర్పు లో తుదినములలో – అగ్ని గంధకమొక తీర్పు క్రీస్తుశిలువ మరణం లోకమున గొప్ప తీర్పు అంత్యతీర్పు ఉంది – అబ్బో అది గొప్ప తీర్పు ||తీర్పు||

5. ధవళ సింహాసనమున – ఆసీనుడౌ క్రీస్తు గొప్పవారు కొద్దివారు – మృతులైనవారందరు చేతులు కట్టుక నిలుతురు – సింహాసనమెదుటనే వారివారి క్రియలనుబట్ట-వరుసగ తీర్పును పొందిరి ॥తీర్పు॥