ఉదయించెను క్రీస్తు
ఉదయించెను క్రీస్తు – హృదయములో సదయుడైన క్రీస్తు – దైవ వాక్యమైన క్రీస్తు
1. పేతురు గాలమువంటిది వాక్యము – మత్స్య ములవలె మానవుల బట్టును సిలువవేసిన యేసుని బోధింప-అంగీకరించిరి ఆ ప్రభునామమున్ ||ఉద||
2. గిద్యోను దివిటీ వంటిది వాక్యము – మానవ చీకటి మటుమాయమగున్ వెలిగించెను జ్యోతి వెలుగించుమనెను వేగమె ప్రభువును వెంటాడమనెను ||ఉద||
3. దావీదు వడిసెలవంటిది వాక్యము గురిజూచి పడద్రోసె గొల్యాతునువాడు గర్విష్టులను గద్దించు వాక్యము – నిర్దోషులను ధన్యులజేయును ||ఉద||
4. పౌలు కవచమును పోలిన వాక్యము-లోక మాలిన్యము కూల ద్రోయును లోభులమై మేము – లాభమాసింపక నీ శాసనము వైపు త్రిప్పుము ప్రభు ||ఉద||
