క్రైస్తవ సంఘమా
క్రైస్తవ సంఘమా – ఇటుగాంచుమా ఆనాటి యపొస్తలుల గాధలు – సంఘవిధులు
1. పేతురు బోధించె క్రీస్తు బోధలు-చేర్చబడిరి మూడువేల మంది భక్తులు అపొస్తలుల బోధన్ – సహహవాసమందున అనిశంబున్ రొట్టెన్ విరిచి ఆరాధించిరి భక్తుల్ ॥క్రైస్తవ॥
2. సంఘమంతనాడు ఏకముగ కూడిరి సమిష్టిగ తమ ఆస్తి నుంచుకొనిరి చర స్తిర ఆస్తులన్ – అమ్మివేసిరందరన్ వారివారి అక్కరల్ కొలది లెక్కవేసి పంచుకొనిరి ॥క్రైస్తవ॥
3. పదునారు మార్కు పదియైదు చూడుమా పరుగెత్తుమా – సువార్త ప్రకటించుమా అపోస్తలులు ముందు – హతసాక్షులైరిగా ప్రభుయేసు వార్తను చాటను పందెంబు లో ముందంజ వేయ్ ||క్రైస్తవ॥
