జీవముగల దేవుని సంఘములో

జీవముగల దేవుని సంఘములో జీవాధిపతి క్రీస్తేసుని సన్నిధిలో జనులేలాగు జీవింపవలెనో – తెలుసుకో సోదరా! తెలుసుకో సోదరీ ||జీవము||

1. యౌవనుడా నీ యౌవనమెవరు – తృణీకరింపనీయకుమా మాటలో ప్రేమలో మంచి మాదిరి నెంచుమా ॥జీవము||

2. స్త్రీలను మౌనులై స్వస్థచిత్తులై – సత్రియలే అలంకారములై పురుషులపై అధికారము చేయక – పూర్ణ విధేయులైయుండుడీ ॥జీవము||

3. భర్తలను తమ భార్యలెనెపుడు-బలహీనంభౌఘటమని యెంచి – భార్యలు తమలో భాగస్వాములని బహుగా ప్రేమతో చాటుడి ॥జీవము॥

4. మాన్యులై పరిచారకులెల్లను-మంచి సాక్ష్యమును కలిగినవారై – విశ్వాసములో మర్మము నెరిగి సాత్వికములో సాగుడి ||జీవము||

5. పెద్దలను బుద్ధిమంతులై – ప్రేమపాలనము చేయవలెన్ సంఘములపై ప్రభువులైయుండక మందకు మాదిరై యుండుడీ ॥జీవము||