నిద్ర మేల్కొను

నిద్రమేల్కొను ఓ సంఘమా – సిద్దపడుమా ఓ సంఘమా నిద్రమేల్కొను ఓ సంఘమా – భద్రపడుమా ఓ సంఘమా

1. పరిశుద్ధాత్మ దేవుండు – పయనంబు చేయుచుండన్ సిద్ధపడుమా విశ్వాసి – ఎదుర్కొనుమా యేసయ్యను ॥నిద్ర॥

2. రాణియైన యావష్తి- రాజాగ్రహము పొందె రాణియైన ఎస్తేరు రాజు దయను పొందె ||నిద్ర||

3. యూదుండు యా మొద్దెకై – సిద్ధపరచె ఎస్తేరున్ రాజాంతపురము కడకు పయనంబు చేసిపంపెన్ ||నిద్ర॥

4. హామాను అగాగీయుడు – యూదులకు బహువిరోధి తాను పన్నిన ఉరిలో తానే మరణమొందెన్ ||నిద్ర॥

5. నీదు మొదటియా ప్రేమా – నీవీడితివని యెరిగెను నీమీద తప్పు ఒకటి మోపెను-నీదురాజు ||నిద్ర॥

6. నీ పూర్వపు స్థితినెరుగు – నీ అంతిమ గతినెరుగు మారుమనస్సులేకున్న – నీ దీపంబు దీయున్ ||నిద్ర॥