లోకంలో సంఘముందా

లోకంలో సంఘముందా – సంఘములో లోకముందా లోకంలో సంఘముండుట సహజమే – సంఘములో లోకమండుట విచిత్రమే IIలోకంలో॥

1. దేవుడు బెట్టాడు లోకంలో సంఘమును సాతాను బెట్టాడు సంఘమంలో లోకంను సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే లోకంలో సంఘం విరుగుడు పడుతుంది IIలోకంలో॥

2. మేడగదిలో కూడెను సంఘం ప్రార్థనకు కూడుచున్నవి కొన్ని సంఘములు నిందలకు ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు నీలో నీకు క్రమము లేక నీరస పడలేవు ॥లోకంలో॥

3. వాస్తవముగ పాపము జేసెను ఒక వనిత బందోబస్తుగ పట్టి తెచ్చిరి ప్రభుకడకు మీలో పాపం లేనివాడు రాయి విసరమనెను తలయెత్తి చూడగా ప్రభువు తలకొక దారైరి ॥లోకంలో॥

4. యేసుప్రభువును నమ్ముకొని ఓడిందెవ్వరు లోకంను నమ్ముకొని గెలిచిందెవ్వరు పాపంలో వున్న మనుజుల ప్రేమతో పిలిచెను పాపం మన్నించి వారల పురమున జేర్చెను ॥లోకంలో॥