దివ్యతేజోమయుడ యేసు

దివ్యతేజోమయుడ యేసు దీనులను కాపాడుమా దేదీప్యమానసుండా దిక్కు నీవే బ్రోవుమా

1. ఉదయకాలపు స్తోత్రములు – ఓ సదయుడా చెల్లింతు ము – సదయుడా చెల్లింతుము- పాద పద్మములందు నిలిచి ప్రభువ నిను సేవించెదం ॥దివ్య॥

2. యుగయుగాల నుండి మాకు-అభయమొసగిన దేవుడా తరతరాల నుండి మమ్ము-కరుణజూపిన ప్రభుడవు ॥దివ్య॥

3. సకల జీవరాశులెల్ల – సన్నుతించును నిను ప్రభో వాని వాని క్రమము చొప్పున- నొసిగితివి ఆహారమున్ ॥దివ్య॥

4. నీదు అడుగు జూడలోన నడుచుకొందుము మా ప్రభో నీతి నియమములందు మేను నిలిచి-జీవింతుము ప్రభో॥దివ్య॥