హృదయపూర్వక వందనము

హృదయపూర్వక వందనము – ఈ ఉదయ కాలము జేతుము సదయుడగు శ్రీయేసునాధుని సన్నిధిని ధ్యానింతుము

1. మాదు పడకల నుండి మమ్ముల – మాన్యుడా కాపాడితి కంఠస్వరములనెత్తి స్తోత్రము- మింటికేగయ పాడెదం ॥హృద||

2. పాపులు వసియించుచుండెడి దాపుచేరక చూడుమా దుష్టుల ఆలోచనలలో – ఇష్టమును రానీకుమా ॥హృద||

3. దేవనీదు ధర్మశాస్త్రము నందు – ఆనందించుచు దివారాత్రము దానియందే-ధ్యానమున్ దయచేయుమా ॥హృద||

4. నీవే మార్గము – నీవే సత్యము – నీవే జీవము మాకిలన్ నీవే గాకింకెవరు దేవ-నిరతము మముగావుమా ॥హృద॥

5. మేము నిలీచెడు స్థలము లందున – మాదు వ్యాపారంబున సాగనంపుము మమ్ము నీకు-సాక్షులముగా నిలుపుమా॥హృద॥