త్రియేకదే దేవదేవుడు
త్రియేకదే దేవదేవుడు మనకందరికి తోడైయుండు గాక త్రియేక దేవుని స్తుతియించుట కొనియాడి కీర్తింప మా భాగ్యము
1. మా పాదములను బండపై నిలిపి మా అడుగులను స్థిరపరచినావు మా నోట నూతన కీర్తననుంచి నీ వాక్యమును మాకు బోధించినావు ||త్రియేకదే||
2. నైవేద్యములను కొరవు నీవు బలియైనను నీవు కోరుటలేదు నీ చిత్తమును యిలనెరవేర్చవలనని నీ మార్గమును మాకు చూపించినావు ||త్రియేకదే||
3. నాయెడల జరిగించు ఆశ్చర్యక్రియలు మా యెడల కలిగించు విస్తార ఫలములు వివరింపతరమా కొనియాడగలమా నీ ఘనతలకుసాటి ఎవరైన గలరా ||త్రియేకదే||
