నియామక కూటములకు
నియామక కూటములకు – నీవు వెళ్ళవా ప్రియసోదర సోదరీ – పిలుపుమరతువా
1. నిన్ను పురికొల్పు పెద్దలు నీరస పడిరా నీకు బోధించు బోధకులు నీరసించెరా నీవు నడచు బాటలు బీటలువారే సంఘమునకు పూర్వమున్న సౌందర్యము పోయె ॥నియామక॥
2. జనభరితమైన సంఘము – జనవిహీనంబాయె ఆశ్చర్య పడిన అన్యులు – అపహాస్యము జేసిరే సంఘముల ఐక్యత సమసిపోయెనే అలంకారహీనురాలై అలసిపోయెనె ॥నియామక॥
3. అనేకులు మానునట్లు నీవు మానుకొందువా మానుకొనుట నీకు తగదు – మరల ప్రభువు చెంతకురా యేసు ప్రభువు దృష్టించును – ఎల్లప్పుడు కరుణించును అంతరంగమందున – ఆదరణ కలుగును ॥నియామక॥
4. పరిశుద్ధత విడనాడకుమా – అన్యులలో కలసిపోకుమా అతిక్రమము విస్తరించెను – అధిపతులు పెద్దలయిరే నిన్ను ప్రేమించిన ప్రభువు నిన్ను పిలుచుచుండగా నియామక కూటములకు-నీవు కలసి వెళ్లుమా ॥నియామక॥
