ఇహలోకంలో పయనించుటకు
ఇహలోకంలో పయనించుటకు – ఎన్నో మార్గములు పరలోకములో పయనించుటకు – ప్రభువే మార్గము దేవుడు ఒక్కడే మార్గము ఒక్కటే – ఆయన యేసయ్యా నేనే మార్గము – నేనే సత్యము – నేనే జీవమనే
1. మేలుకలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకొనుడి పురాతన మార్గములన్నిటిని పూర్తిగ విడువండి కావలి కాయుటకు నీకు – కలడొక రక్షకుడు బూరధ్వని వినబడగానె – బయలుదేర రండి ॥ఇహ॥
2. ఇరుకు మార్గము ప్రవేశించుడి – అదే జీవమార్గం నాశనమునకు పోవుమార్గాలు – విశాలమైయున్నవి అనేకులుందురు ఆ మార్గములో – అవి తీర్పుకునడుపున్ ఏడ్పును, దుఃఖం, పండ్లుకొరుకుటయు-ఎంతో భయంకరము ॥ఇహ॥
3. యేసు మార్గమున తప్ప తండ్రిని – ఎవ్వడు చేరడుగా యేసుక్రీస్తుని ఎరిగినవారే – దేవుని ఎరుగుదురు దేవుని చూడవలెనని ఎందరో దిగులు పడుచునుందురు యేసే మార్గం – యేసే సత్యం యేసే జీవమనె ॥ఇహ॥
