యేసు నీ రాకడ

యేసూ నీ రాకడ – ఏవేళ వచ్చునో యేసయ్య రాకడ – ఏమేమి జరుగునో సంధించుమా ప్రభున్ స్వాగతం పల్కుమా

1. ఎన్నరానిబాధలు – ఎన్నెన్నో శ్రమలు ఎచ్చటగాంచిన – హెచ్చైన వేదనల్ ఎదుర్కొను ప్రభువును-ఏమరియుండకు సంధించు, పూజించు-సాగిలపడి వేడుము ||యేసు||

2. కన్యకలిద్దరు – కలిసి విసరుచుండగా కొనిపోబడు ఒక్కతే-విడువబడు మరొక్కతె మనగతి యంతియె – దూరకున్న మనసులు విశ్వసించు మనస్సుంచు- విడవకుండ సాగుమా ||యేసు||

3. ఉరుములు మెరుపులు-కరువు కాటకంబులు పంచభూతంబులు-పారిపోవున్ పరుగిడి కడవరి దినములలో – కన్ను మూసి యుండకు రారాజై, భూరాజై – రాజ్యమేల బోవును ||యేసు||

4. పరిశుద్ధులెల్లరు-సిద్ధపడి యుండుడి నీతిమంతుని రాకతో-నీతి ఫలములర్పించు సంధించు నీ ప్రభున్-సాష్టాంగ పడుమా చెంతజేరు, ఎంతో వేడు-చేరుకొనుము యేసులో ||యేసు||