మృతుల నుండి

మృతుల నుండి క్రీస్తు ప్రభువు లేచెను జీవముతో కూడిన నిరీక్షనిచ్చెను అక్షయమైనదీ – నిర్మలమైనది వాడబారని – పరలోకరాజ్యము

1. దేవుడెవని ముందుగా నెరిగెనో నిర్ణయించి అతని కొసగే క్రీస్తు స్వరూపం నరుని పాపస్వభావంబు తానెభరించి పరలోకమందు భద్రపరచెపరమ స్వాస్థ్యము ॥మృతు॥

2. క్రీస్తు విషయమైన శ్రమల గూర్చియు తరువాత కలుగబోవు మహిమగూర్చియు ప్రభువు త్వరగ దివికి వచ్చినప్పుడు మహిమ ఘనత ప్రభావములు మనకు కలుగును ॥మృతు॥

3. కక్ష చేతనైన నేమి చేయక వృధాతిశయము చేత నేమి చేయక వినయమైన మనసు కలిగియుండుడి ఒకనినొకడు యోగ్యుడనియెంచుడి॥మృతు॥

4. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డిని పోలియున్నవి గడ్డి ఎండును దాని పువ్వురాలును ప్రభువు ప్రేమ ఎల్లప్పుడు నిలిచియుండును ॥మృతు॥