యేసు నామధ్యానమే
యేసు నామధ్యానమే – నా హృదయ గానము యేసు నామధ్యానమే – నా హృదయ గానము
1. ఆనందించుచున్నది – నా హృదయం యేసునందు అతిశయించుచున్నది – నా అంతఃకరణమునాలో లేడు లేడు ఒకడును లేడు – యేసు తప్ప దేవుడు లేడు ఆశ్రయదుర్గము ఆయనే-ఆయనే నాకు అనంతజ్ఞాని ||యేసు|
2. బలాడ్యులైన విలుకాండ్రు – ఓడిపోయిరి ఆయనతో తొట్రిల్లెడి ప్రజలందరను – బలము పొందిరి ఆయనలో సజీవులైన మానవాళిని – మృతులుగ జేయును ఆయనే పాతాళములో పడినవారిని-పైకి తీయును ఆ ప్రభువే ||యేసు||
3. దరిద్రులను అధికారులతో – కూర్చుండబెట్టును దీనులను ఆసనములపై – అధిష్ఠింపచేయును తను నమ్మిన పరిశుద్ధులను – పరమున చేర్చును ఆయనే ఆదియు అంతము ఆయనే- అనంతజ్ఞాని ఆ ప్రభువే ॥యేసు॥
