భూలోకమా – ఆలకించుమా
భూలోకమా – ఆలకించుమా బూరధ్వని వినపడగా – మేలుకొనుమా
1. ఎన్నో మార్గములున్నవని – ఏల విచారింతువు పురాతనమార్గములను – పూర్తిగ విడనాడుము మేలుకలుగు మార్గమొకటి – యేసు ఏర్పరచెను అందులో అడుగిడి ఆ ప్రభువును వేడుమా ||భూలోకమా||
2. రక్తం చిందించనిదీ – రాదు పాపపరిహారం పరిశుద్ధ గ్రంథమందు – ప్రభువే వ్రాయించెను తన రక్తము చిందించి – మన పాపము బాపెను సర్వలోకులకిదియె – సత్యమైన మార్గము ||భూలోకమా||
3. మరణము అంటే మనకు మహా భయంకరము కదా మరణమును మ్రింగి ప్రభువు మనుజుల రక్షించెను అట్టి మహాదేవుని – రక్షకునిగ నమ్ముము పాపపరిహారమొసగి – ప్రభువు చెంత చేర్చును ||భూలోకమా||
