సహోదరులారా

సహోదరులార – ప్రభువు రాకడ సమీపమాయెను – ఓర్చుకొనుడి

1. వ్యవసాయకుని చూచితిరా తొలకరి కడవరి వర్షము సమకూరు వరకు ఓర్చెను విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కనిపెట్టి యుండుడి-ఓర్చుకొనుట నేర్వుడి ॥సహో॥

2. ఒకరిమీద ఒకరు సణగకుడి సణిగి నశించిరి సహోదరులు ఒకరిని ఒకరు ప్రేమించుడి – ఒకరితో ఒకరు కలసుండుడి కలసిమెలసి జీవించిన కలదు సుఖము ఓ ప్రియుడా ॥సహో॥

3. ఇదిగో న్యాయాధిపతి వాకిట-నిలచియున్నాడు గమనించితివా సిద్ధపరచు నీ హృదయమును – తీర్పు పొందకుండు నిమిత్తం తీర్పు తప్పిన ధన్యుడవుదువుగా పరమరాజ్యంలో నీవుందువుగా ॥సహో॥

4. యోబు సహనము గూర్చి విన్నావుగా- జాలికనికరమును కన్నావుగా ప్రభు వాక్యము బోధించు ప్రవక్తల-శ్రమానుభవనము ఓపికగా మాదిరియై కనిపెట్టి యుండుడి-మహిమారాజ్యములోకి వెళ్ళుడి ॥సహో॥