సరిహద్దు రాళ్ళను

సరిహద్దు రాళ్ళను పాతించుమా సరిహద్దు దాటక పయనించుమా

1. ఆదాము హవ్వలు ఏదేను వనములో సరిహద్దులదాటి ఫలితమును పొందిరి వద్దన్న పనిచేసి హద్దులు మీరిన తత్ఫలితం మనమైన తప్పక పొందెదము ॥సరి||

2. ఇశ్రాయేలీయుల ఇండ్ల కమ్ములపై రక్తము పూయగా గుర్తించె యెహోవా ఐగుప్తు దేశము అంతయు పాడాయె దేవుని ప్రజలను దివ్యముగ కాపాడె ॥సరి||

3. షిమ్మీని పిలిపించి సెలవిచ్చె యెహోవా యెరూషలేములో నీవు యిల్లును కట్టమనె కట్టిన యింటినుండి కాలుబెట్టకుమనె కిద్రోను వాగుదాటి తెచ్చుకొనే మరణంబు ॥సరి||

4. తల్లిదండ్రుల మాట తప్పక వినుడి సంఘములో పెద్దలకు లోబడియుండుడి సరిహద్దు దాటక చక్కగా ప్రవర్తించు అజ్ఞాతి క్రమమే అది పాప బంధమవును ॥సరి||