మన యేసు హృదయంలో

మన యేసు హృదయంలో వున్నది మరువరాని ప్రేమ ఆయన ఆంతర్యములోనున్నది – అనంతమైన ప్రేమ

1. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నా పాపముకై క్రయధనంబుగా సిలువలో మరణించాడు నన్ను క్షమించాడు – నా పక్షం చేరాడు నన్ను స్వీకరించాడు నూతన వ్యక్తిగా మార్చాడు ॥మన॥

2. పరలోక మహిమలో – అత్యున్నత శిఖరాగ్రములో దేవునిచేత ప్రకటించబడి – ఆసీనుడయ్యాడు వెలగైయున్నాడు – వెలిగించుచున్నాడు రాజుగా దీవికి వస్తాడు-రారాజుగా పాలన చేస్తాడు ॥మన॥

3. మ్రానుపై వ్రేలాడి క్రీస్తు – మరణ వేదనలు పొందాడు మానవుల, అపరాధములన్ని – మరణముగెల్చి క్షమించాడు క్రీస్తు పునరుద్ధానము – మనరక్షణకాధారము అదే నిత్యజీవం – అదే దేవుని వరం ॥మన॥