మన యేసు మంచి వ్యవసాయకుడు
మన యేసు మంచి వ్యవసాయకుడు నిర్మాణకుడు పరిశ్రామికుడు సర్వము నిర్వహించు దేవుడు సాధుశీలుడు మన ప్రభువు
1. సత్తువ భూమిగల కొండమీద ప్రియుడొక తోటను వేశాడు ద్రాక్ష పండ్లు ఫలించుట కొరకై తోటను చక్కచేశాడు ఎన్నోపాట్లు పడ్డాడు – ఎంతో శ్రమకోర్చాడు ॥మన॥
2. బలిసిన గచ్చపొదలను బలురాకాసి చెట్లను పలుగుతో పొడిచి పొరతో త్రవ్వి బురుజును కట్టాడు – ద్రాక్షతొట్టి తొలిచాడు ॥మన॥
3. శ్రేష్ఠ ద్రాక్ష తీగెలు నాటి ఎంతో శ్రద్ధగా పెంచాడు ద్రాక్షపండ్లు ఫలించకపోగా కారు ద్రాక్షలే కాసినవి కంచెను కొట్టివేతునని గోడను పడగొట్టెదనని ఆజ్ఞ ఇచ్చి మేఘములకు ఆపివేసె వర్షమును ॥మన॥
4. ప్రభువును నమ్మిన పిల్లలము – ఆయనకిష్టమైన వనము న్యాయము కొరకు చూడగా బలత్కారమే వినబడెను నీతికావలెనని వెదకగా రోదనయే కనబడెను శ్రమలే మిగిలెను మనకు తీర్పు జరుగును ॥మన॥
