ఈ మందిరం ప్రార్ధన మందిరం

ఈ మందిరం ప్రార్థన మందిరం పరిశుద్ధులు చేరి ప్రార్థన చేసే ప్రార్థన మందిరం

1. సర్వసృష్టికి నిర్మాణకుడు ప్రభువే దీనికి ప్రారంభకుడు నీ సాయముతో నిర్మించుకొంటిమి – ప్రభువా దీవించు ఈ మందిరము ॥ఈ॥

2. నిర్జీవమైన రాళ్ళవంటిమము – సజీవమైన రాళ్లుగజేసి సంఘమను మందిరముగ మముజేసి – శిల్పిని నీపై నిర్మించుకొంటివి ॥ఈ॥

3. నీ కృపమాకు లేకపోయిన – మా ప్రయాస వృదయౌకాదా నీవే మందిరం నిర్మించుకున్న -మాపని అంతయు వ్యర్థముకాదా ॥ఈ॥

4. ఈ మంచికార్యము చేయుట కొఱకై -బలము నిచ్చితివి భాగ్యమిచ్చితివి పురికొల్పితివి, ప్రోత్సహించితివి పూజనీయుడ పూర్తి చేసితివి ॥ఈ॥

5. శిల్పివి నిర్మాణకుడవు నీవే చేర్చుము మము ఆపరమపురి తీర్చుము దిద్దుము దీనుల దేవా – దీవెనలొసగి దీవించుము ప్రభో ॥ఈ॥