నీ మందిర ఆవరణములో

నీ మందిర ఆవరణములో – ప్రభుయేసు నిసంచారములో పిలువబడినవారు ఎంతో – ధన్యులు ధన్యులహో

1. నీ మందిర సమృద్ధి వలన – సంతృప్తి పొందితిమి ప్రభువా చిరకాలము – నివశింతుమూ చిరజీవనదాత ॥నీ॥

2. నీ మందిర ఆవరణములో – ఒక దినము గడిపెదము ప్రభువా అది ఎంతో ఆనందము-వేయి దినములకంటే శ్రేష్ఠము ॥నీ॥

3. నీ మందిర ఆవరణములనే – దర్శించనాసించితిమిగా నా ప్రాణము-నా ఆత్మయు-సొమ్ముసిల్లుచున్నది ప్రభువా ॥నీ॥

4. ప్రభుయేసుని మందిరములో- పచ్చని ఒలీవృక్షముగా చిగురించుచు–పుష్పించుచు-ఫలియించుచునుందుముగా ॥నీ॥

5. నా జీవిత కాలమంతా – నే బ్రతికెడి దినములన్ని నా దేవుని సన్నిధిలో-నివశింపగోరుదుము ॥నీ॥