శ్రీకరుండై శ్రీయేసు

శ్రీకరుండై శ్రీ యేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగాన – ఉదయించెన్ ఈ జగాన

1. పాపుల కొఱకై ఇలకరుదెంచె-పశువులపాక యందు పవళించె పరమాత్ముని ప్రేమయే మనయేసు ప్రజలందరి పెన్నిధి ప్రభుయేసు ||శ్రీకరుండై||

2. తూర్పు దేశపు జ్ఞానులు నేర్పుమీర-గొట్టెలకాపరులు కోర్కె తీర సాంబ్రాణి బోళ బంగారముతో ఆరాధించిరి ఆ కానుకతో ||శ్రీకరుండై||

3. గొల్లలు పసిబాలుని దర్శించె – మెల్లగ సువార్త ప్రజకందించె ప్రభునమ్మిన భక్తులు పరుగిడియు ప్రచురించరండి ప్రభు నామమును ||శ్రీకరుండై॥