మానవా మరలిరా

మానవా మరలిరా – ప్రభుచెంతకు చేరవా ప్రభుపిలచే ఈ తరుణములోన – ప్రాణముండగ ప్రవేశించుమన్న

1. హృదయములో నెమ్మదిలేక – వేసారి విసిరిన బ్రతుకా కడసారి నిరీక్ష ఇదియే యేసయ్యాకలువరి శిలువే నీ వ్యవసనమునే భరియించి నా శింతినీకిస్తున్న అన్నాడు యేసు ప్రభువు – సమాధాన కర్తగా నిలిచి ॥మానవా॥

2. పాపభారము తోడనిండి – పగిలిపోతున్న నిర్జీవ పాత్ర కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్యా కలువరిశిలు వే – పాపాలు క్షమించుట కొరకై బలియైతినంటున్న యేసు నాకు పాపక్షమాపణనిచ్చి నన్ను పవిత్రుని చేయునయ్యా ||మానవా॥

3. మోక్షానికి మార్గమేది కనిపించక తిరిగే ఓ యాత్రికా కడసారి నిరీక్షణ యిదియే – యేసయ్యా కలువరి శిలువే ॥మానవా॥