విరిగి నలిగి నశియించు
విరిగి నలిగి నశియించు మనుజులన్ గావను వేగమే యేసా పరము నుండి – భువి కరుగుదెంచిన పాపాల పాలిటి యేసా
అ.ప. ధన్య ధన్య శ్రీయేసా ధన్య ధన్య శ్రీయేసా ధన్య ధన్య శ్రీయేసా
1. ఇహలోకములో మహాద్భుతంబులనెన్నో జేసిన యేసా మా పాపంబుల మన్నించుటకై-మరణించిన శ్రీ యేసా॥ధన్య॥
2. నిన్ను ఆశ్రయించిన వారినందరినీ – రక్షించిన ఓ యేసా భయములన్నిటిని పారద్రోలి – అభయమిచ్చిన యేసా॥ధన్య॥
3. రోగులనెల్ల ఆదరించి-ఆరోగ్యము నిచ్చిన యేసా ఆపదలో వున్న వారినెల్లను-ఆదుకున్న శ్రీయేసా ॥ధన్య॥
4. మరణమున్ జయించి లేచి-జయమునిచ్చిన యేసా జీవమునిచ్చి పరమునజేర్చిన-మా ప్రియ పరమేశా ॥ధన్య॥
