యేసు క్రీస్తుకు మించిన

యేసుక్రీస్తుకు మించిన దైవం వేరే లేదుగా ఎన్ని లోకములు వెదకిచూచిన ఎవరిని గానముగా

1. ఋగ్వేదములో మరుగుకాబడిన యజ్ఞ పశువుక్రీస్తేగా కలువరి శిలువలో బలియై మనుజుల పాపము బాసెనుగా (2 సార్లు) ॥యేసు॥

2. నేనే మార్గం -నేనే సత్యం-నేనే జీవంబని పలికె నా ద్వార తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడనెను – తండ్రి యొద్దకురాడనెను ||యేసు||

3. తనమహత్తుగల మాటచేత సర్వంబును క్రీస్తు నిర్మించి క్రీస్తు నందు విశ్వాసంబుంచిన – పరమును చేరుదువు ||యేసు||