దయామయహా

దయామయహా శ్రీ యేసు ప్రభో నీ దీవెనలన్ వర్షింపుమిలన్ ఈ పాపులను – ఈ జగమునను కృపావరమున్ కాపాడుమయా

1. అణకువతోను – మెళకువతోను అనుదినమును అనుభవముతోను ప్రసాదించుమా మా అందరకు దినదినమును ||దయా||

2. ప్రార్థనలోను – కొలిచెదయెదన్ మనమున యెడన్ సహనమిమ్ము నీవె మా ప్రేమలాప్తుడవు నీకె మాస్తుతుల్ చెల్లించెదము ||దయా||

3. క్షమించుటలోను-ప్రేమించుటలోను సేవించుటలోను-సహించుటలోను ప్రసాదించుమా-మాకందరకు ప్రతిదినము-విశ్వాసముతో ॥దయా||