మా యేసు – మా ప్రభువా

మా యేసు – మా ప్రభువా- నీపాదసేవనయే మాకు సదా జీవనము

1. నీ వాక్యమే నీదరిశనమౌ నీ ఆత్మయె నిత్య బలంబౌ నీ మాటలే నీ రాజనముల్ గదా మా కవివాగ్దానంబులుగా ||మా యేసు||

2. శిలువలో రుధిరము చిందితివి కలుషాత్ముని నను కడిగితివి స్తోత్రింతును నా జీవిత మంత నీ చెంతనే నుండియు హల్లెలూయ ||మా యేసు||

3. పాపిని నను-క్షమించితివి పరిశుద్ధునిగా-జేసితివి మరువగలనా-ప్రేమామృతమున్ కీర్తించగలను-నీ కరుణన్ ||మా యేసు||