ప్రభుని జననంబు
ప్రభుని జననంబు ప్రియులారా వినుడి విశదంగ చెవులారా గ్రహించాలండి మనసారా ఆచరించాలి ప్రియమారా
1. ఈ జగతిని నీవే సృష్టించి ఈ జగతిని నీవే పోషించి కరుణచూపి కాపాడితివి స్వరములెత్తి స్తుతించెదను ||ప్రభుని||
2. ఒకే జననంబు గావించి ఒకే గమ్యంబు ఆశించి ఒకే తనువై ఒకే మనస్పై మమ్ము చేర్చావు పరమందు ||ప్రభుని||
3. అశాశ్వతమైన బ్రతుకునకు నీ శాశ్వత జీవమిచ్చితివే మృత్యుంజయుడా విమోచకుడా మోక్ష రాజ్యాధి పాలకుడా ||ప్రభుని||
