క్రైస్తవుండ కదులుమా
క్రైస్తవుండ కదులుమా – సత్క్రియలతో సాగుమా శరీరాశల్ విసర్జించుమా – యేసు రాజు నాశ్రయించుమా
1. సత్రియే ధనముగా – సాగిపొమ్ము ఘనముగా సత్రియలందాసక్తి కల్గి – సత్కార్యముల్ చేసి రూఢిగన్ దీనిని నమ్ముమా-నేడే నీవు ప్రతిన బూనుమా ॥క్రైస్త॥
2. దొర్కా సత్రియులు-ఆమె ధర్మ కార్యములు విశేషమైన ఆదరణను చూరగొనిన శిష్యురాలు నీవు దీని నమ్ముమా-నిబద్ధతతో సాగిపోవుమా ॥క్రైస్త॥
3. మన ప్రతి సత్కార్యము-దేవునికిష్టమైన కార్యము ఆలోచించి అడుగువేసి-ఆశ్చర్యాన్ని కలిగించు ప్రభుకొరకు సాగిపోవుమా-పరలోకపు ఫలము పొందుమా ॥క్రైస్త॥
