దేవాలయము కంటే గొప్పవాడ
దేవాలయముకంటె గొప్పవాడ అందరిలో అతి శ్రేష్ఠుడా
నీ నామమును వివరింపతరమే
నీ ప్రాభావమును ప్రకటింపతరమె ॥దేవా॥
1. ఆకాశములు నిను పట్టజాలవు
విరిగిన హృదయము కోరుకున్నావు
మహ దేవుడవు మా రక్షకుడవు
దీనుడవై నీవు ధరకేగినావు ॥దేవా॥
2. పాప భారములు భరియించితివి
పాపిని నీవు కరుణించితివి
కల్వరిగిరిలో మరణించితివి
మూడవ దినమున లేచిన యేసయ్య ॥దేవా॥
3. కనికరమును నీవు కోరుచున్నావు
బలియాగములన్ కోరని ప్రభువా
మా రోగములను భరియించితివా
మా దోషములను మన్నించితివా ||దేవా॥
