దేవా దేవా దేవా

దేవా ! దేవా ! దేవా ! నీ సింహాసనము నిరంతరము నిలుచున్ నీ రాజ్యదండము న్యాయార్ధమైనది

1. నీతిని ప్రేమించితివి – దుర్ణీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు – ఆనందతైలముతో అభిషేకించెను నిను హెచ్చించెను. ||ప్రభువా||

2. ప్రభువా ! ప్రభువా ! ప్రభువా ! నీవేగదా సృష్టించితివి పుడమిన్ -ఆకాశములను నీ హస్తకృత్యములే- అవి అన్నియు నశించును శాశ్వతముగ నుందువు నీవు అవి పాతగిలు వస్త్రములవలె వాటిని మార్చెదవు – మడచినేతువు మరుగుచేతువు. ॥యేసూ॥

3. యేసూ! క్రీస్తు! యేసూ ! నీ నామమున్ స్తుతిగానము చేతున్ – సమాజములలో చాటించి కీర్తింతున్ నిను ఏ మాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయన్- అని చేసితివి వాగ్దానముల్ నేనేమి భయపడను ధైర్యంబుతో ధరన్ జీవించెదన్. ||దేవా॥