నా జన్మ పావనమాయె
నా జన్మపావనమాయె – నా కర్మ విమోచనమాయె నా జన్మ సార్థకమాయె – ఆ – ఆ – ఆ – నా ప్రభువున్ స్తోత్రించెదన్ నా యేసుని స్తుతియించెదన్
1. శిలువాలో నా ప్రభుని – సిరసూన ముండ్ల మకుటం మోదిరి మాన్యుని తలపై కార్చెను తల నుండి కన్నీరు రక్తం – ఓర్చెను నా ప్రభువు నా పాపభారం – సర్వాంగములతో హోమంబు జేతు అంగీకరించు ఆరాధన ||నా జన్మ॥
2. డొక్కలో బల్లెంబు గ్రక్కున బొడువ – కసిదీర దిగగొట్టిరి కాళ్ళకు మేకుల్ – కొరడాలతో చీల్చిరి కొమరుని దేహం-దాహం దాహంబ నగా త్రాగించిరి చేదున్ – అయ్యయ్యో మన శిలువ ఆ యేసు భరియించె – ఆత్మతో సత్యముతో ఆరాధింతున్ ||నా జన్మ॥
3. ముసుగువేసి ముఖముపై నుమిసి ప్రవచింపు మని గ్రుద్ధిరి. ప్రాణంబుబోవ – అరచేతులతో చరచిరి అతిదారుణమగా ఏలీ ఏలీలామ సబక్తానీయనుచో ప్రాణంబు విడిచె – కృతజ్ఞత చెల్లించి కొనియాడెదన్ ||నా జన్మ॥
