నా ప్రాణమా

నా ప్రాణమా అంతరంగమందున్న సమస్తమా యెహెూవాను సన్నుతించుము – యేసునాధున్ కొనియాడుము ॥నా ప్రాణ॥

1. వ్యాజ్యమున్నది నీతో వ్యాజ్యమాడడు కోపమున్నది నీపై కోపగింపడు పాపంబులను బట్టి ప్రతీకారము చేయడు దోషంబులన్నిటిని దూరపరచుచున్నాడు ॥నా ప్రాణ॥

2. ఉపకారము చేయును మరువకుండుము విమోచనంబొనర్చును విడువకుండుము సంకటముకుదుర్చును సాక్షిగనుండు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు ॥నా ప్రాణ॥

3. భూమి కంటె ఆకాశం ఎంత ఉన్నతం భయభక్తులు కలిగిన కృప అంతటి అధికం పడమటికిని తూర్పుకును ఎంతదూరమో మన అతిక్రమంబు నంత మనకు దూరపరిచినాడు॥నా ప్రాణ॥

4. కరుణకటాక్షంబులు నీకు కిరీటం క్రొత్తదగును పక్షివలె నీదుయవ్వనం నీ తండ్రి ఆజ్ఞపాలించుట నీకాహారం సమాధి నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు ॥నా ప్రాణ॥

5. నరుని ఆయువు గడ్డిపరక వంటిది అడవి పూవు పూయునట్లు అతడు పూయును గాలివీచగా నతడు లేకపోవును ప్రభువే అతనికి శరణం- ప్రార్థించుట కర్తవ్యం ॥నా ప్రాణ॥